Gudivada Amarnath: ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం

AP Minister Amarnath condemns CM KCR comments
  • కేసీఆర్, హరీశ్ రావు వ్యాఖ్యలను ఖండించిన అమర్నాథ్  
  • ఎన్నికలు వచ్చినప్పుడు ఏపీని కించపరిచేలా ప్రసంగాలు చేయడం సరికాదని వ్యాఖ్య
  • ఏపీలో అమలు చేస్తున్న పథకాలను తెలంగాణ మేనిఫెస్టోలో ప్రకటించారన్న ఏపీ మంత్రి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అమర్నాథ్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్, హరీశ్ రావుల వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికలు వచ్చిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ను కించపరిచేలా ప్రసంగాలు చేయడం బీఆర్ఎస్ నాయకులకు ఏమాత్రం సరికాదన్నారు. ఏపీలో అమలు చేస్తున్న పథకాలను తెలంగాణ మేనిఫెస్టోలో ప్రకటించారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణలో చేసిన అభివృద్ధి పనులపై మాట్లాడాలని సూచించారు. తెలంగాణ రోడ్లు, ఏపీ రోడ్లను చూడాలని, అలాగే ఏపీలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని కేసీఆర్ ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ఆశీర్వాద సభలలో అన్నారు. అంతకుముందు హరీశ్ రావు.. హైదరాబాద్‌ను, అమరావతిని పోలుస్తూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి తీవ్రంగా స్పందించారు.

  • Loading...

More Telugu News