Vijay Devarakonda: విజయ్ దేవరకొండపై ప్రశంసలు కురిపించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

TDP MP Rammohan Naidu praises Vijay Devarakokonda
  • ప్రమాదంలో కాలు పోగొట్టుకున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన అమ్మాయి
  • లక్ష రూపాయల చెక్ పంపించిన విజయ్ దేవరకొండ
  • పాపకు చెక్ అందించిన రామ్మోహన్ నాయుడు

ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ కష్టాల్లో ఉన్న వారికి సాయంగా ఉంటారనే విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళికి చెందిన ఒక పాప ఇటీవల జరిగిన ఒక ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. తన అభిమాన సంఘాల ద్వారా విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ... ఆ చిన్నారికి లక్ష రూపాయల చెక్ పంపించారు. ఈ చెక్ ను ఆ పాపకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అందించారు. ఈ సందర్భంగా విజయ్ ను ప్రశంసించారు. 'దైవం మానుష రూపేణ' అనే వాక్యానికి అర్థంగా నిలుస్తూ విజయ్ దేవరకొండ చేసిన సాయం ఆయన సహృదయానికి నిదర్శనమని చెప్పారు.

  • Loading...

More Telugu News