Virat Kohli: ఫ్యాన్స్ పాటకు మైదానంలో పర్‌ఫెక్ట్‌గా స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ.. వీడియో ఇదిగో!

Virat Kohli Joins Fun With Perfect Steps Against Sri Lanka
  • శ్రీలంకతో మ్యాచ్‌లో అభిమానులను అలరించిన కోహ్లీ
  • ‘రామ్ లఖన్’ సినిమాలోని ‘మై నేమ్ ఈజ్ లఖన్’ పాట పాడిన ఫ్యాన్స్
  • ఫ్యాన్స్ పాటకు కాలు కదిపిన కోహ్లీ

టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మైదానంలో ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. ఆటగాళ్లను ఉత్సాహ పరుస్తూ, ఫ్యాన్స్‌ను విష్ చేస్తూ, స్టెప్పులేస్తూ చేసే హంగామా అందరినీ హుషారెత్తిస్తుంది. గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటునాటు’పాటకు మైదానంలో కాలు కదిపిన కోహ్లీ.. నిన్న శ్రీలంకతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లోనూ ఓ పాటకు స్టెప్పులేసి అభిమానులను అలరించాడు.

బౌండరీ లైన్ వద్ద కోహ్లీ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ‘రామ్ లఖన్’ సినిమాలోని ‘మైనేమ్ ఈజ్ లఖన్’ అని గ్యాలరీలోని ఫ్యాన్స్ పాడడం మొదలుపెట్టారు. ఆ పాట కాస్తా విరాట్ చెవిన పడడంతో కాలు కదపకుండా ఉండలేకపోయాడు. ఆ పాటకు పర్‌ఫెక్ట్‌గా రెండు స్టెప్పులు వేసి అలరించాడు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.  కాగా, నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ 88 పరుగుల వద్ద అవుటై సెంచరీ‌తోపాటు సచిన్ వన్డే సెంచరీల రికార్డును సమం చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

  • Loading...

More Telugu News