Chandrababu: మరికాసేపట్లో ఆసుపత్రి నుంచి చంద్రబాబు డిశ్చార్జ్

Chandrababu to discharge this afternoon
  • ఏఐజీ ఆసుపత్రి నుంచి నేరుగా ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి
  • అక్కడ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకునే అవకాశం
  • ఏఐజీ ఆసుపత్రిలో బాబుకు పలు పరీక్షలు చేసిన వైద్యులు

వైద్య పరీక్షల కోసం నిన్న హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరికాసేపట్లో డిశ్చార్జ్ కానున్నారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని ఎల్వీప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ క్యాటరాక్ట్‌కు శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం ఉంది.

ఏఐజీ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కే రాజేశ్ ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్‌తోపాటు కార్డియాలజీ, పల్మనాలజీ, డెర్మటాలజీ విభాగాల నిపుణుల బృందం చంద్రబాబును పరీక్షించి వివిధ పరీక్షలు సూచించింది. రక్త, మూత్ర పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, కాలేయ, మూత్రపిండాల పనితీరు, అలర్జీ స్క్రీనింగ్ ఇతర టెస్టులు చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News