Nara Lokesh: జగన్ కక్షతో రగిలిపోతున్నాడన్న విషయం ప్రజలకు పూర్తిగా అర్థమైంది: నారా లోకేశ్

Nara Lokesh slams CM Jagan after another case filed on Chandrababu
  • చంద్రబాబుపై తాజాగా ఇసుక తవ్వకాల కేసు
  • జగన్ మానసిక స్థితి గురించి జనం మాట్లాడుకుంటున్నారన్న లోకేశ్
  • జగన్ మానసిక ఆరోగ్యంపై గవర్నర్ కేంద్రానికి నివేదిక పంపాలని విజ్ఞప్తి
  • సీఐడీని వైసీపీ అనుబంధ విభాగంగా మార్చుకున్నారని విమర్శలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై తాజాగా ఇసుక తవ్వకాల కేసు నమోదు చేసిన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. జగన్ కక్షతో రగిలిపోతున్నాడన్న విషయం రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థమైందని అన్నారు. 

చంద్రబాబుపై కేసు మీద కేసు పెడుతున్న జగన్ మానసిక స్థితి గురించి జనం మాట్లాడుకుంటున్నారని తెలిపారు. జగన్ మానసిక స్థితిపై రాష్ట్ర గవర్నర్ ఓ నివేదిక రూపొందించి కేంద్రానికి పంపాలని లోకేశ్ కోరారు. 

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని, కానీ చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించారని మండిపడ్డారు. ఉచితంగా ఇసుక ఇచ్చినా అందులోనూ కుంభకోణం ఉందంటూ ఇప్పుడు ఇంకో కేసు పెట్టారని వెల్లడించారు. 

సీఐడీని వైసీపీ అనుబంధ విభాగంగా మార్చుకున్నారని, విపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. సీఎం పీఠంపై ఉండేందుకు జగన్ అనర్హుడని స్పష్టం చేశారు.
Nara Lokesh
Chandrababu
Jagan
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News