cpi: ఒకే సీటు కేటాయిస్తే సీపీఐ కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై?

CPI leaders to meet tomorrow over alliance with congress
  • రేపు కూనంనేని అధ్యక్షతన సీపీఐ కార్యవర్గం భేటీ
  • పొత్తు కుదరకుంటే ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై చర్చ
  • చెన్నూరు, కొత్తగూడెం కోరుతున్న సీపీఐ

కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఇప్పటికే సీపీఎం గుడ్‌బై చెప్పింది. ఈ విషయంలో సీపీఐ కూడా నిర్ణయం తీసుకోనుంది. రేపు సీపీఐ రాష్ట్ర కార్యవర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు పార్టీ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన కార్యవర్గం భేటీ కానుంది. కాంగ్రెస్‌తో పొత్తు విషయమై ఇంకా స్పష్టత రాని క్రమంలో ఏం చేయాలనేది రేపు చర్చించనున్నారు. పొత్తు కుదరకుంటే ఎన్ని సీట్లలో పోటీ చేయాలో నిర్ణయించనున్నారు. చెన్నూరు, కొత్తగూడెం టిక్కెట్లను సీపీఐ కోరుతోంది. అయితే కాంగ్రెస్ ఒక సీటు ఇచ్చేందుకు సిద్ధమంటోంది. ఒకే సీటు ఇస్తే కనుక పొత్తు పెట్టుకోవద్దని సీపీఐ నిర్ణయించే అవకాశాలు ఉన్నాయి.

కొత్తగూడెం సీపీఐలో ముసలం

కొత్తగూడెం సీపీఐలో ముసలం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ ఒకే సీటు ఇచ్చేందుకు సిద్ధమని చెబుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ సీటును సాబిర్ పాషాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం సీపీఐ కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేశారు. సీట్ల కోసం అధిష్ఠానం అధికార పార్టీతో రాజీపడుతోందని వారు ఆరోపించారు. ఈ సీటును సాబిర్ పాషాకు ఇవ్వకుంటే అవసరమైతే పార్టీకి కూడా రాజీనామా చేస్తామని కౌన్సిలర్లు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News