vivek: రాహుల్ గాంధీ ఫోన్ చేసి పిలిచారు: కాంగ్రెస్‌లో చేరడంపై మాజీ ఎంపీ వివేక్

Former MP Vivek on joining in Congess
  • పోటీపై పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటానన్న వివేక్
  • కేసీఆర్ అవినీతి పాలన నుంచి విముక్తి కలిగించడమే తన లక్ష్యమని వ్యాఖ్య
  • ఖర్గేను కలిసిన వివేక్, తనయుడు వంశీ

కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ తనకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసి పిలిచారని మాజీ ఎంపీ జి.వివేక్ అన్నారు. బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వివేక్ ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పార్టీ ఆదేశాల ప్రకారం తాను నడుచుకుంటానని చెప్పారు. పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడి నుంచి బరిలోకి దిగుతానన్నారు. కేసీఆర్ అవినీతి పాలన నుంచి విముక్తి కల్పించడమే తన లక్ష్యమని చెప్పారు. కాగా, వివేక్ తన తనయుడు వంశీతో కలిసి ఖర్గేను కలిశారు.

చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వివేక్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వివేక్ తనయుడు వంశీ పెద్దపల్లి నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. వామపక్షాలకు చెన్నూరు కేటాయిస్తామని తొలుత కాంగ్రెస్ తెలిపింది. ఇప్పుడు పొత్తుకు బ్రేక్ పడిన నేపథ్యంలో వివేక్‌కు చెన్నూరు టిక్కెట్ ఖరారైనట్లుగా భావించవచ్చునని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News