USA: నగ్నంగా రోడ్లపై తిరుగుతూ.. పోలీసులపైనే ఎదురు దాడి చేసిన యువకుడు.. వీడియో ఇదిగో!

Naked Man In US Steals Patrol Vehicle After Assaulting Cop
  • పోలీస్ పెట్రోల్ కారును ఎత్తుకెళ్లి యాక్సిడెంట్ చేసిన వైనం
  • ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు.. పోలీసుల అదుపులో నిందితుడు
  • అమెరికాలోని లాస్ వెగాస్ లో మంగళవారం రాత్రి ఘటన
అమెరికాలోని లాస్ వెగాస్ సిటీలో ఓ యువకుడు నగ్నంగా రోడ్లపై తిరుగుతూ హల్ చల్ చేశాడు. వాహనదారులు అందించిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీస్ అధికారిపై దాడి చేశాడు. ఆపై పోలీస్ పెట్రోలింగ్ కారును ఎత్తుకెళ్లాడు. వేగంగా దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టాడు. దీంతో ఆ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని, వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలకు పంపినట్లు వెల్లడించారు. ఈ ఘటనలో పోలీస్ ఆఫీసర్ కు స్వల్ప గాయాలయ్యాయని వివరించారు.

రోడ్లపై నగ్నంగా తిరుగుతూ వాహనదారులను భయాందోళనకు గురిచేసిన వ్యక్తిని క్లైడే కాబులిసన్ (29) గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. క్లైడే మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. అయినప్పటికీ క్లైడేపై దొంగతనం (పోలీస్ పెట్రోల్ కార్ ఎత్తుకెళ్లినందుకు), పోలీస్ అధికారి ఆదేశాలను ధిక్కరించడం, వెహికల్ యాక్ట్ రూల్స్ ఉల్లంఘన ఆరోపణలు నమోదు చేసినట్లు వివరించారు. కాగా, అక్కడే ఉన్న ఓ కార్ డ్రైవర్ ఈ ఘటన మొత్తాన్ని తన మొబైల్ కెమెరాలో బంధించాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం అది వైరల్ గా మారింది.
USA
los vegas
Police petrol
naked man
cop assault
Viral Videos

More Telugu News