Chandrababu: మనవడు దేవాన్ష్ ను చూసి వెలిగిపోయిన చంద్రబాబు ముఖం... ఫొటోలు ఇవిగో!

Chandrababu gets emotional after seeing grandson Devansh
  • స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
  • ఈ సాయంత్రం రాజమండ్రి జైలు నుంచి విడుదలైన టీడీపీ అధినేత
  • చంద్రబాబు కోసం జైలు వద్దకు వచ్చిన కుటుంబ సభ్యులు
  • దేవాన్ష్ ను ఆప్యాయంగా హత్తుకున్న చంద్రబాబు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు 52 రోజుల రిమాండ్ తర్వాత నేడు బయటికి వచ్చారు. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు నేడు తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో, చంద్రబాబు రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. 

కాగా, చంద్రబాబు విడుదల అవుతున్న విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు కూడా జైలు వద్దకు వచ్చారు. నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ జైలు గేటు వద్ద చంద్రబాబు కోసం వేచిచూశారు. 

భారీ జనసందోహం నడుమ నడుచుకుంటూ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు దేవాన్ష్ ను చూసి పట్టలేని ఆనందం వ్యక్తం చేశారు. ఆయనలో వాత్సల్యం కట్టలు తెంచుకుంది. దేవాన్ష్ ను ఎంతో ఆపేక్షతో దగ్గరకు తీసుకుని హత్తుకున్నారు. మనవడి బుగ్గలు చిదుముతూ ముద్దు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
Chandrababu
Devansh
Grandson
Rajahmundry Jail
TDP

More Telugu News