Chandrababu: పోలీసులను, బ్యారికేడ్లను తోసుకుంటూ రాజమండ్రి జైలు వద్దకు చేరుకున్న వేలాది టీడీపీ నేతలు, కార్యకర్తలు   

Thousands of TDP leaders and supporters reaches Rajahmundry central jail
  • కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్న చంద్రబాబు
  • పోలీసుల హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా తోసుకొచ్చిన టీడీపీ శ్రేణులు
  • జైలు వద్దకు చేరుకున్న బాలకృష్ణ, వసుంధర, దేవాన్ష్
ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. మరోవైపు జైలు వద్ద సెక్షన్ 144 విధించారు. టీడీపీ శ్రేణులు జైలు వద్దకు రాకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే, పోలీసుల హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా వేలాది మంది నేతలు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. పోలీసులను, బ్యారికేడ్లను తోసుకుంటూ వారు జైలు వద్దకు చేరుకున్నారు. జైలు వద్ద ఇసుక వేస్తే రాలని పరిస్థితి నెలకొంది. ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర, లోకేశ్ కుమారుడు దేవాన్ష్ జైలు వద్దకు చేరుకున్నారు. విజయనగరం పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరి కాసేపట్లో రాజమండ్రికి చేరుకునే అవకాశం ఉంది.
Chandrababu
Rajahmundry Central Jail
Telugudesam

More Telugu News