Chandrababu: మద్యం కేసులో ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

Chandrababu gets relief in AP High Court in liquor case
  • చంద్రబాబును అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు తెలిపిన ఏజీ
  • మద్యం కేసులో వచ్చే నెల 15న కౌంటర్ దాఖలు చేస్తామన్న ఏజీ
  • తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసిన హైకోర్టు

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మద్యం కేసులో కూడా ఆయనకు హైకోర్టు ఊరటను ఇచ్చింది. ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ కేసును హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా, చంద్రబాబును ఈ కేసులో అరెస్ట్ చేయబోమని అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇతర కేసుల్లో చంద్రబాబును అరెస్ట్ చేయబోమని తెలిపారు. స్కిల్ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా వ్యవహరించబోమని చెప్పారు. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ స్టేట్మెంట్ ను హైకోర్టు రికార్డు చేసింది. తదుపరి విచారణను నవంబర్ 21కి వాయిదా వేసింది. మద్యం కేసులో వచ్చే నెల 15న కౌంటర్ దాఖలు చేస్తామని హైకోర్టుకు ఏజీ తెలిపారు.

  • Loading...

More Telugu News