Virat Kohli: సెంచరీతో కోహ్లీ పుట్టిన రోజు సంబరాలు: మహమ్మద్ రిజ్వాన్

World Cup 2023 Hope Virat Kohli gets his 49th ODI hundred on birthday says Mohammad Rizwan
  • నవంబర్ 5న కోహ్లీ 35వ పుట్టిన రోజు
  • అదే రోజు దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మ్యాచ్
  • కోహ్లీ 49వ సెంచరీ సాధించాలంటూ రిజ్వాన్ ఆశాభావం
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన 35వ పుట్టిన రోజును ఎప్పటికీ గుర్తుండిపోయేలా మార్చుకోనున్నాడా..? ఇప్పుడు చాలా మంది అభిమానుల మనసుల్లో వస్తున్న ప్రశ్న ఇదే. ఎందుకంటే నవంబర్ 5న కోహ్లీ పుట్టిన రోజు. అదే రోజు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో భారత్ దక్షిణాఫ్రికాతో పోరాడనుంది. మరి తన పుట్టిన రోజు సందర్భంగా సెంచరీ చేసి అభిమానులకు గుర్తుండిపోయే గిఫ్ట్ ను కోహ్లీ ఇస్తాడేమో చూడాలి. పాకిస్థాన్ క్రికెటర్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ అయితే ఇదే కోరుకుంటున్నాడు.

ఓ మీడియా సంస్థతో రిజ్వాన్ మాట్లాడిన సందర్భంగా కోహ్లీ పుట్టిన రోజు ప్రస్తావన వచ్చింది. అదే రోజు దక్షిణాఫ్రికాతో భారత్ కు మ్యాచ్ ఉండడంతో దీనిపై రిజ్వాన్ స్పందిస్తూ.. ‘‘కోహ్లీ పుట్టిన రోజు నవంబర్ 5న ఉందని తెలియడం సంతోషంగా ఉంది. నేను నా పుట్టిన రోజును జరుపుకోకపోయినా, నమ్మకపోయినా.. అతడికి నా తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు. పుట్టిన రోజు నాడు వన్డే కెరీర్ లో 49వ సెంచరీ సాధించాలని ఆశిస్తున్నాను. ఈ ప్రపంచకప్ లోనే కోహ్లీ 50వ సెంచరీ కూడా సాధించాలని కోరుకుంటున్నాను’’ అని రిజ్వాన్ బదులిచ్చాడు. ఈ ప్రపంచకప్ లో కోహ్లీ మంచి ఫామ్ లో ఉండడం తెలిసిందే. దీంతో సెంచరీ సాధించడం అతడికి పెద్ద కష్టమేమీ కాదు.
Virat Kohli
35TH BIRTH DAY
CENTURY
Mohammad Rizwan

More Telugu News