Salman Khan: పక్కనే సల్మాన్ ఖాన్ ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ముందుకెళ్లిన క్రిస్టియానో రొనాల్డో... వీడియో ఇదిగో!

Cristiano Ronaldo seems ignored Salman Khan in a boxing event in Saudi Arabia
  • సౌదీ అరేబియాలో బాక్సింగ్ పోటీలకు హాజరైన సల్మాన్ ఖాన్
  • ఇదే ఈవెంట్ కు విచ్చేసిన అంతర్జాతీయ సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో
  • సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న వీడియో
బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ అడుగేస్తే అభిమానులు నీరాజనాలు పలుకుతుంటారు. అతడు ఎక్కడికి వెళితే అక్కడ ఇసుకేస్తే రాలనంతగా జనం పోగవుతారు. కానీ అది భారత్ లో! 

సల్మాన్ ఖాన్ సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో ఓ బాక్సింగ్ ఈవెంట్ కు హాజరవగా, ఆ కార్యక్రమానికి అంతర్జాతీయ ఫుట్ బాల్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో కూడా విచ్చేశాడు. అక్కడ రొనాల్డో పాప్యులారిటీ ముందు సల్మాన్ ఖాన్ హవా ఏమంత కనిపించలేదు. అంతెందుకు... పక్కనే సల్మాన్ ఖాన్ ఉన్నప్పటికీ పట్టించుకోకుండా క్రిస్టియానో రొనాల్డో ముందుకెళ్లిపోయాడు. భారీ కోలాహలం మధ్య రొనాల్డో వెళుతుంటే సల్మాన్ అలా చూస్తూ ఉండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

అయితే ఇదే ఈవెంట్ లో సల్మాన్ ఖాన్, రొనాల్డో ముచ్చటించుకుంటున్నట్టు, ఒకే వరుసలో కూర్చుని బాక్సింగ్ పోటీలను వీక్షిస్తున్నట్టు కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.
Salman Khan
Cristiano Ronaldo
Riyadh
Saudi Arabia
Soccer
Bollywood
India

More Telugu News