Chandrababu: చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ పూర్తి... రేపు తీర్పు

High Court reserves verdict on Chandrababu interim bail petition
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ
  • ముగిసిన వాదనలు... తీర్పు రిజర్వ్ లో ఉంచిన న్యాయమూర్తి
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ లో ఉంచింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై తీర్పును రేపు (అక్టోబరు 31) వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అంతేకాకుండా, చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ఎప్పుడనేది రేపు నిర్ణయిస్తామని చెప్పారు. చంద్రబాబు తరఫున న్యాయవాదులు మధ్యాహ్నం వరకు వాదనలు వినిపించగా, మధ్యాహ్నం తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
Chandrababu
Interim Bail Petition
Verdict
Reserve
AP High Court
Skill Development Case
TDP
Andhra Pradesh

More Telugu News