Kottu Satyanarayana: వారిది అక్రమ కలయిక: కొట్టు సత్యనారాయణ

TDP and Janasena alliance is illegal says Kottu Satyanarayana
  • లోకేశ్ వల్లే చంద్రబాబుకు ప్రాణహాని ఉందన్న మంత్రి కొట్టు సత్యనారాయణ
  • న్యాయస్థానాలను తప్పుపట్టేలా భువనేశ్వరి తీరు ఉందని వ్యాఖ్య
  • కాపులు సిగ్గుపడేలా పవన్ వ్యవహరిస్తున్నారని మండిపాటు

నారా లోకేశ్ వల్లే చంద్రబాబుకు ప్రాణహాని ఉందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చంద్రబాబును జైల్లో పెడితే ప్రజలెవరూ బాధ పడలేదని ఎద్దేవా చేశారు. న్యాయస్థానాలను తప్పుపట్టేలా నారా భువనేశ్వరి తీరు ఉందని విమర్శించారు. అబద్ధాలతో న్యాయం గెలవాలి అన్నట్టుగా ఆమె వ్యవహరిస్తున్నారని అన్నారు. సొంత తండ్రి ఎన్టీఆర్ కు అన్యాయం జరిగితే ఏనాడూ స్పందించని భువనేశ్వరి... భర్త జైలుకు వెళ్తే పోరాటం చేస్తారా? అని మండిపడ్డారు. ఎన్టీఆర్ ది తప్పు, చంద్రబాబుదే కరెక్ట్ అని భువనేశ్వరి చెప్పగలరా అని ప్రశ్నించారు. 


టీడీపీ - జనసేనలది అక్రమ కలయిక అని బొత్స అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు పార్టీల మధ్య సీట్ల గొడవ ఉందని చెప్పారు. కాపులు సిగ్గు పడేలా పవన్ కల్యాణ్ తీరు ఉందని అన్నారు. ఆర్థిక లబ్ధి కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News