MLC Kavitha: గాజాలో పరిస్థితి నన్ను కలచివేస్తోంది: కల్వకుంట్ల కవిత

Deeply saddened by the humanitarian crisis unfolding in Gaza says MLC Kavitha
  • యుద్ధం ఏదైనా మొదటి బాధితులు మహిళలు, చిన్నారులేనన్న ఎమ్మెల్సీ
  • ఏ తల్లీ తన బిడ్డలను పోగొట్టుకోవద్దని కోరుకుంటున్నట్లు వెల్లడి
  • ఇజ్రాయెల్, హమాస్ గొడవకు శాంతియుత పరిష్కారం లభించాలని ఆకాంక్ష

ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య పోరు కారణంగా గాజాలో ఏర్పడిన సంక్షోభం తనను కలచివేస్తోందని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే, యుద్ధం ఏదైనా సరే.. బాధితుల్లో ముందు మహిళలు, చిన్నారులే ఉంటారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా ఏర్పడిన మానవతా సంక్షోభం వీలైనంత త్వరగా తొలగిపోవాలని ప్రార్థిస్తున్నట్లు వివరించారు.

త్వరలోనే గాజాలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న గొడవకు శాంతియుత పరిష్కారం లభించాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. గాజాలో ఏ తల్లీ కూడా తన బిడ్డలను కోల్పోవద్దని.. ముఖ్యంగా యుద్ధానికి తన బిడ్డలను కోల్పోవద్దని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News