Team India: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత జట్టు నల్ల రిబ్బన్లు ఎందుకు ధరించిందో తెలుసా?

Why Team India Was Wearing Black Armbands In Lucknow Match
  • ఈ నెల 23న కన్నుమూసిన టీమిండియా దిగ్గజ ఆటగాడు బిషన్‌సింగ్ బేడీ
  • ఆయనకు నివాళిగా నల్ల రిబ్బన్లు ధరించి ఆడిన భారత ఆటగాళ్లు
  • 1966-78 మధ్య భారత జట్టు విజయాల్లో బేడీది కీలక పాత్ర

ఇంగ్లండ్‌తో గత రాత్రి జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో టీమిండియా చేతికి నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగింది. ఆటగాళ్ల చేతికి బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్స్ చూసిన అభిమానులు వాటిని ఎందుకు ధరించారో అర్థంకాక అయోమయానికి గురయ్యారు. ఈ నెల 23న కన్నుమూసిన టీమిండియా దిగ్గజ ఆటగాడు బిషన్‌సింగ్‌బేడీకి నివాళిగానే ఆటగాళ్లు వీటిని ధరించి బరిలోకి దిగారు. ఇదే విషయాన్ని బీసీసీఐ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.

 1946లో పంజాబ్‌లోని ప్రముఖ నగరమైన అమృత్‌సర్‌లో జన్మించిన బిషన్‌సింగ్ బేడీ 266 వికెట్లు తీసుకున్నాడు. 14సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. ఓ మ్యాచ్‌లో పదికి 10 వికెట్లు సాధించాడు. 1966-1978 మధ్య భారత జట్టు విజయాల్లో బేడీ కీలక పాత్ర పోషించాడు. 1990లో న్యూజిలాండ్, ఇంగ్లండ్ దేశాల్లో పర్యటించిన భారత జట్టుకు మేనేజర్‌గానూ వ్యవహరించాడు. 

మణీందర్‌సింగ్, సునీల్ జోషీ, మురళీ కార్తీక్ వంటి స్పిన్నర్లను తీర్చిదిద్దింది ఆయనే. జాతీయ జట్టుకు సెలక్టర్‌గానూ వ్యవహరించాడు. మన్సూర్ అలీఖాన్ పటౌడీ రిటైర్మెంట్ తర్వాత 1975 నుంచి 1979 వరకు నాలుగేళ్లపాటు ఇండియన్ టీంకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు.

  • Loading...

More Telugu News