Nagam Janardhan Reddy: ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన నాగం

Nagam Janardhan Reddy met CM KCR at Pragathi Bhavan
  • తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు
  • కాంగ్రెస్ కు రాజీనామా చేసిన నాగం జనార్దన్ రెడ్డి
  • బీఆర్ఎస్ లో చేరాలంటూ నాగంను ఆహ్వానించిన కేటీఆర్, హరీశ్ రావు
  • సీఎం కేసీఆర్ తో మర్యాదపూర్వకంగా సమావేశమైన నాగం

మరో నాలుగు వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, తెలంగాణ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం, వెంటనే ఆయన నివాసానికి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు వెళ్లడం, ఆయనను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం తెలిసిందే. ఆ తర్వాత మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్, హరీశ్ ల ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన నాగం జనార్దన్ రెడ్డి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. సీఎం కేసీఆర్ తో నాగం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇరువురు కాసేపు చర్చించుకున్నారు. ప్రగతి భవన్ కు వచ్చిన సందర్భంగా నాగంను సీఎం కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు. నాగం బీఆర్ఎస్ లో ఎప్పుడు చేరతారన్నది ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News