Kallu Teripiddam: 'కళ్లు తెరిపిద్దాం'... కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపిన నారా లోకేశ్, బ్రాహ్మణి

Nara Lokesh and Brahmani protests with blind folds
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • 'కళ్లు తెరిపిద్దాం' అంటూ నేడు టీడీపీ నిరసనలు
  • రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన

స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో, జగనాసురుడి 'కళ్లు తెరిపిద్దాం' అంటూ టీడీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. 'కళ్లు తెరిపిద్దాం' కార్యక్రమంలో నారా లోకేశ్, బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. కళ్లకు గంతలు కట్టుకున్న లోకేశ్, బ్రాహ్మణి 'నిజం గెలవాలి' అనే ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. 

రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు 'కళ్లు తెరిపిద్దాం' కార్యక్రమంలో పాల్గొన్నాయి. కళ్లకు గంతలు కట్టుకుని, ప్రదర్శనలు చేపట్టారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యాక మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు నిరసన కార్యక్రమాలకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 'కళ్లు తెరిపిద్దాం' కార్యక్రమం చేపట్టారు.

  • Loading...

More Telugu News