Ram Gopal Varma: ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎలా బేబీ?: నారా లోకేశ్ వ్యాఖ్యలకు రామ్ గోపాల్ వర్మ కౌంటర్

Ram Gopal Varma strong reaction over Nara Lokesh comments
  • రాజమండ్రి జైలు వద్ద ఇటీవల వర్మ సెల్ఫీ
  • నేను బయట... ఆయన లోపల అంటూ ట్వీట్
  • లోకేశ్ ను స్పందించాలని కోరిన మీడియా
  • చంద్రబాబు రాష్ట్రానికి ఎంతో చేశాడు... వర్మ ఏంచేశాడన్న లోకేశ్
  • చూడు బేబీ అంటూ వర్మ రియాక్షన్
రాజమండ్రి జైలులో చంద్రబాబును కలిశాక నారా లోకేశ్ మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జైలు ఎదుట సెల్ఫీ తీసుకుని చేసిన వ్యాఖ్యల పట్ల మీడియా లోకేశ్ ను స్పందన కోరింది. దానిపై లోకేశ్ మాట్లాడుతూ, చంద్రబాబు రాష్ట్రానికి ఎంతో చేశారు... వర్మ ఏం చేశాడు రాష్ట్రానికి... అతడేదో అంటే నేను మాట్లాడాలా అంటూ బదులిచ్చారు. లోకేశ్ వ్యాఖ్యలపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. 

లోకేశ్ ను చూసి జాలిపడాలో, నవ్వాలో, లేక ఏంచేయాలో అర్థం కావడంలేదని అన్నారు. "ఆంధ్ర రాష్ట్రానికి నేనెందుకు చేస్తాను... నేను ఒక ఫిలింమేకర్ ని. నేను సినిమాలు తీస్తుంటాను. నేను నీలాగా ప్రజలకు సేవ చేయడానికి పుట్టాను, పెరుగుతున్నాను, చస్తాను అని ఎప్పుడైనా చెప్పానా. 

చూడు బేబీ... నన్ను విమర్శించాలని నువ్వు అనుకున్నావు. మరి నన్ను విమర్శించేందుకు ఆంధ్ర రాష్ట్రం తప్ప మరో టాపిక్ దొరకలేదా. నీ స్థానంలో నేనుంటే ఏం చెప్పేవాడ్నో తెలుసా... వాడొక పిచ్చోడు, పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తుంటాడు, అడ్డదిడ్డమైన ట్వీట్లు పెడుతుంటాడు, పొద్దునే లేచి పోర్న్ చూస్తాడు... అలాంటి వాడు ఏదో అంటే అందుకు నేను స్పందించాలా అనేవాడ్ని. ఆ మాత్రం కూడా తెలివి లేకపోతే ఎలా బేబీ! 

నా జీవితం తెరిచిన పుస్తకం వంటిది. నీలాగా స్విమ్మింగ్ ఫూల్ లో అమ్మాయిలతో కలిసున్న ఫొటోలు దాచిపెట్టడం వంటివేవీ నా దగ్గర ఉండవమ్మా. చంద్రబాబు ఉన్న పరిస్థితి చూసి నీ మైండ్ ఏమైనా స్థిరత్వం కోల్పోయిందేమో... ఎవరికైనా చూపించుకో. నాలాంటి వాడ్ని విమర్శించడానికే నువ్వు సరైన టాపిక్ ఎంచుకోలేకపోతే, మీ నాన్నను ఇక దేవుడు కూడా కాపాడలేడు" అంటూ వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలతో కూడిన వీడియోను వర్మ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Ram Gopal Varma
Nara Lokesh
Chandrababu
Rajahmundry Jail

More Telugu News