CBN Gratitude Concert: హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ప్రారంభం

CBN Gratitude Concert in Hyderabad
  • హైటెక్ సిటీ సిల్వర్ జూబ్లీ వేడుకలు
  • బాలయోగి స్టేడియంలో చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం
  • భారీగా తరలి వచ్చిన అభిమానులు
  • హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు

హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం బాలయోగి స్టేడియంలో కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు మద్దతుదారులు, టీడీపీ అభిమానులు భారీగా తరలివచ్చారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ అర్ధాంగి వసుంధరాదేవి, గారపాటి లోకేశ్వరి తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో చంద్రబాబుపై స్పెషల్ వీడియో ప్రదర్శించారు.

  • Loading...

More Telugu News