K Kavitha: చిరంజీవికి చాలా పెద్ద అభిమానిని.. కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha Says She Is A Die Hard Fan Of Megastar Chiranjeevi
  • ఒకసారి అభిమాని అయితే ఎప్పటికీ అభిమానేనని వెల్లడి
  • ఆ తర్వాత బన్నీ నటన అంటే ఇష్టమన్న ఎమ్మెల్సీ
  • ‘ఆస్క్ కవిత’ అంటూ నెటిజన్ల ప్రశ్నలకు జవాబిచ్చిన బీఆర్ఎస్ నేత
ఒకసారి అభిమాని అయ్యాక ఇక ఎప్పటికీ అభిమానిగానే ఉంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. మెగస్టార్ చిరంజీవికి ‘డై హార్డ్ ఫ్యాన్’ అని చెప్పిన కవిత.. చిరు తర్వాత అల్లు అర్జున్ నటన అంటే ఇష్టమని వివరించారు. ఈమేరకు ‘ఆస్క్ కవిత’ పేరుతో నెటిజన్లతో ఇంటరాక్ట్ అయిన కవిత.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు జవాబుగా.. ‘చిరంజీవి ఆల్వేజ్!!! నెక్ట్స్ అల్లు అర్జున్.. తగ్గేదేలే’ అని రిప్లై ఇచ్చారు. పాలిటిక్స్ లో, నిత్యం ప్రజాసేవలో బిజీబిజీగా గడుపుతున్నప్పటికీ చిరంజీవి సినిమాలు తప్పకుండా చూస్తానని ఆమె వివరించారు. చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని కవిత గతంలోనూ పలు సందర్భాల్లో వెల్లడించారు.

ఎమ్మెల్సీ కవిత జవాబుతో చిరంజీవి, అల్లు అర్జున్ చాలా ఆనందపడుతున్నారు. చిరు, బన్నీ ఫొటోలను కామెంట్లలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వూలో కవిత మాట్లాడుతూ.. మీ అభిమాన హీరో ఎవరన్న యాంకర్ ప్రశ్నకు చిరంజీవి అని చెప్పారు. ఇప్పటికీ ఆయనే మీ ఫేవరేట్ హీరోనా అని యాంకర్ మరో ప్రశ్న సంధించగా.. ఒకసారి అభిమాని అయితే అంతే.. ఇక ఎప్పటికీ అభిమానిగానే ఉండిపోతామని కవిత తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో మరోసారి వైరల్ గా మారింది.

K Kavitha
MLC Kavitha
BRS
Megastar Fan
Die Hard Fan
Banny

More Telugu News