Police: హైదరాబాద్‌లో రూ.30 లక్షల హవాలా నగదు పట్టివేత

Police seized hawala money in hyderabad
  • హైదరాబాద్‌లో పట్టుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు
  • నగదుతో పాటు మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
  • ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా హవాలా నగదును పట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలీసులు పెద్ద మొత్తంలో హవాలా నగదును పట్టుకోవడం గమనార్హం. పోలీసుల తనిఖీల్లో దాదాపు రూ.30 లక్షల నగదు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. నగదును తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నగదుతో పాటు అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు... రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.
Police
Hyderabad Police
Telangana Assembly Election

More Telugu News