Kallu Teripiddam: 'కళ్లు తెరిపిద్దాం'... కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ

TDP calls for another program Kallu Teripiddam
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • వివిధ రూపాల్లో టీడీపీ నిరసనలు
  • ఇప్పటివరకు 'మోత మోగిద్దాం', 'కాంతితో క్రాంతి', 'న్యాయానికి సంకెళ్లు' కార్యక్రమాలు
  • రేపు 'కళ్లు తెరిపిద్దాం' కార్యక్రమం

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్టయ్యాక 'మోత మోగిద్దాం', 'కాంతితో క్రాంతి', 'న్యాయానికి సంకెళ్లు' పేరిట తెలుగుదేశం పార్టీ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతోంది. 

తాజాగా, టీడీపీ కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీని పేరు 'కళ్లు తెరిపిద్దాం'. రేపు (అక్టోబరు 29) రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు కళ్లకు గంతలు కట్టుకుని, వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా "నిజం గెలవాలి" అంటూ గట్టిగా అరవాలని టీడీపీ పేర్కొంది. 

జగనాసుర చీకటి పాలనకు నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోవాలని కోరింది.

  • Loading...

More Telugu News