Ch Malla Reddy: మహిళను ఒడిలో కూర్చోబెట్టుకుని ఓటు అడిగిన మల్లారెడ్డి

Malla Reddy election campaign
  • మరోసారి వార్తల్లోకి ఎక్కిన మల్లారెడ్డి
  • మేడ్చల్ మున్సిపల్ పరిధిలో మల్లారెడ్డి ప్రచారం
  • గౌరమ్మ అనే మహిళను ఒడిలో కూర్చోబెట్టుకున్న వైనం
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి స్టైయిలే వేరు. ఆయన ఏది చేసినా ప్రత్యేకంగా ఉంటుంది. జనాలను విశేషంగా అకట్టుకుంటుంది. తాజాగా ఆయన మరోసారి వార్తల్లోకి ఎక్కారు. వివరాల్లోకి వెళ్తే... మేడ్చల్ మున్సిపల్ పరిధిలో మల్లారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక పని చర్చనీయాంశంగా మారింది. గౌరమ్మ అనే వృద్ధ మహిళను చంటి పిల్లలా తన ఒడిలో కూర్చోబెట్టుకుని, తనకు ఓటు వేయాలని అడిగారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగిపోయారు. మరోవైపు, 18వ వార్డులో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వారందరికీ మల్లారెడ్డి స్వాగతం పలికారు.

Ch Malla Reddy
BRS
Woman

More Telugu News