Mukesh Ambani: ‘మాకు 20 కోట్లు ఇవ్వకుంటే నిన్ను చంపేస్తాం’.. అంబానీకి బెదిరింపు లేఖ

Mukesh Ambani Gets Death Threat
  • షాదాబ్ ఖాన్ పేరుతో ఈమెయిల్ చేసిన దుండగులు
  • శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన ముఖేశ్ సిబ్బంది
  • అంబాని ఇంటి వద్ద సెక్యూరిటీ పెంచిన పోలీసులు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీకి శుక్రవారం బెదిరింపు లేఖ వచ్చింది. తమకు రూ.20 కోట్లు ఇవ్వాలని అందులో డిమాండ్ చేసిన దుండగులు సొమ్ము ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించారు. దేశంలోనే మంచి షూటర్లు తమ దగ్గర ఉన్నారని హెచ్చరించారు. ఈమేరకు శుక్రవారం షాదాబ్ ఖాన్ పేరుతో దుండగులు అంబానీకి ఈమెయిల్ చేసినట్లు సమాచారం. దీనిపై ముఖేశ్ వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు చేయడంతో గాందేవి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ చేపట్టారు.

ఐపీసీ సెక్షన్ 387, 506 (2) కింద కేసు నమోదు చేసుకున్నట్లు వివరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ముఖేశ్ అంబానీ ఇళ్లు ఆంటాలియా వద్ద సెక్యూరిటీని మరింత పెంచారు. కాగా, గతేడాది కూడా ముఖేశ్ ఇలాంటి బెదిరింపులను ఎదుర్కొన్నారు. హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని, ముఖేశ్ నివాసం అంటాలియాను బాంబులతో పేల్చేస్తామని దుండగులు బెదిరించారు. ఈ కేసులో బీహార్ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
Mukesh Ambani
Death Threat
Antilia
email
mumbai

More Telugu News