Riyan Parag: టీ20 క్రికెట్లో రియాన్ పరాగ్ అరుదైన రికార్డు

Riyan Parag breaks Sehwag record by six consecutive fifties in T20 Cricket
  • టీ20 క్రికెట్లో వరుసగా 6 అర్ధసెంచరీలు సాధించిన పరాగ్
  • సెహ్వాగ్ రికార్డు తెరమరుగు
  • 2012 ఐపీఎల్ సీజన్ లో వరుసగా 5 ఫిఫ్టీలు నమోదు చేసిన సెహ్వాగ్
ఐపీఎల్ మ్యాచ్ లు చూసిన వారికి రియాన్ పరాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధనాధన్ బ్యాటింగ్ తో పాటు, లెగ్ స్పిన్ బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్ తో అలరిస్తుంటాడు. అయితే ఈ అసోం క్రికెటర్ ఇంకా జాతీయ జట్టు గడప తొక్కలేదు. 

తాజాగా దేశవాళీ క్రికెట్లో పరుగులు వెల్లువెత్తిస్తున్న రియాన్ పరాగ్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో పరాగ్ అసోం జట్టు తరఫున వరుసగా 6 అర్ధసెంచరీలు సాధించి చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో వరుసగా ఇన్ని అర్ధసెంచరీలు మరెవ్వరూ నమోదు చేయలేదు. 

ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉండేది. సెహ్వాగ్ 2012 ఐపీఎల్ సీజన్ లో వరుసగా 5 ఫిఫ్టీలు కొట్టాడు. ఇవాళ కేరళతో జరిగిన మ్యాచ్ లో 57 పరుగులు చేసిన రియాన్ పరాగ్ వరుసగా ఆరో అర్ధసెంచరీ నమోదు చేసి, సెహ్వాగ్ రికార్డును అధిగమించాడు.
Riyan Parag
Record
Fifties
Sehwag
T20 Cricket

More Telugu News