Nara Bhuvaneswari: టీడీపీ, జనసేన అఖండ విజయం సాధించబోతున్నాయి: భువనేశ్వరి

TDP and Janasena going to have huge victory says Nara Bhuvaneswari
  • పాలకులు మంచివారైతేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న భువనేశ్వరి
  • రాజధాని లేని రాష్ట్రంలా ఏపీ తయారయిందని ఆవేదన
  • చంద్రబాబు చేసిన నేరం ఏమిటని ప్రశ్న
అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మన దేశాన్ని నడిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అన్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన పాలకులు మంచి వారైతేనే ప్రజలకు మేలు జరుగుతుందని... వారు చెడ్డ వారైతే ప్రజలకు కీడు జరుగుతుందని అంబేద్కర్ ఆనాడే చెప్పారని తెలిపారు. వైసీపీ వాళ్లది ధన బలమైతే... టీడీపీది ప్రజా బలమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు. కాళహస్తిలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

కమీషన్ల కోసం కంపెనీలను వెళ్లగొట్టడం, కరెంట్ బిల్లులు పెడితే కేసులు పెట్టడం తదితర దారుణాలు తప్ప ఏపీలో మరేమీ లేదని భువనేశ్వరి అన్నారు. రాజధాని లేని రాష్ట్రంలా ఏపీ తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపిన చంద్రబాబును 49 రోజులుగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన నేరమేమిటని ప్రశ్నించారు. పోలవరం కట్టడం, అమరావతి రాజధానిని నిర్మించడం, పరిశ్రమలను ఏర్పాటు చేయడమే ఆయన చేసిన నేరమా? అని ప్రశ్నించారు.
Nara Bhuvaneswari
Chandrababu
YSRCP
janase

More Telugu News