Akash Ambani: ప్రధాని మోదీపై యువ అంబానీ ప్రశంసలు

Akash Ambani praises PM Modi for always working on latest technology
  • మా తరానికి దేశాన్ని మార్చే అవకాశం కల్పించినట్టు ప్రకటన
  • ప్రధానికి తమ కంపెనీ ఉత్పత్తులను పరిచయం చేసిన ఆకాశ్ అంబానీ
  • ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ సదస్సు
భారతదేశ కుబేరుడు, రిలయన్స్ సామ్రాజ్యాధినేత ముకేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఏడో ఎడిషన్ కార్యక్రమం సందర్భంగా ఇది చోటు చేసుకుంది. దీన్ని ప్రధాని మోదీ  ప్రారంభించారు. ఈ సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ  ప్రధానిని అభినందించారు. 

‘‘ప్రతి తరానికి ఓ విజన్ అంటూ ఉండాలి. ఆ విజన్ ఎన్నింటికో ప్రోత్సాహంగా నిలవాలి. మీరు (ప్రధాని మోదీ) మా తరానికి మన దేశాన్ని వికసిత భారత్ గా మార్చాలనే దృక్పధాన్ని కల్పించారు’’ అని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ దేశంలో తొలి శాటిలైట్ ఆధారిత గిగా ఫైబర్ సర్వీస్ ‘జియో స్పేస్ ఫైబర్’ను విడుదల చేసింది. ఇది అధిక వేగంతో కూడిన బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందించేందుకు వీలు కల్పిస్తుంది. 

దేశీయంగా రిలయన్స్ అభివృద్ధి చేసిన టెక్నాలజీ, ఉత్పత్తులను ప్రధాని మోదీకి ఆకాశ్ అంబానీ వివరించారు. జియో స్పేస్ ఫైబర్ ద్వారా కొత్తగా లక్షలాది మందికి చేరువ అవుతామని ఆకాశ్ అంబానీ ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోదీ 100 5జీ ల్యాబ్ లను ప్రారంభించారు. 
Akash Ambani
Relaince
Jio infocom
praises
Narendra Modi

More Telugu News