Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి టీసీఎల్ సంస్థ ప్రతినిధుల సంఘీభావం

TCL Company Representatives Supports Nara Bhuvaneswari
  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వికృతమాల గ్రామంలో భువనేశ్వరిని కలిసిన కంపెనీ ప్రతినిధులు
  • చంద్రబాబు హయాంలో రూ. 3,500 కోట్లతో ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేసినట్టు వివరించిన వైనం
  • కంపెనీ ద్వారా రూ. 1500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభిస్తుందని వివరణ
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడి భార్య నారా భువనేశ్వరికి టీసీఎల్ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌తో మృతి చెందిన వారి కుటుంబాల పరామర్శకు వెళ్తున్న భువనేశ్వరిని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వికృతమాల గ్రామంలో కలిసి మద్దతు తెలిపారు. 

   ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు జాసన, అమరేంద్ర, సురేశ్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో రూ. 3,500 కోట్ల పెట్టుబడితో సంస్థను ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా 1500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి లభించినట్టు తెలిపారు. సంస్థ ఉత్పత్తులు తదితర వాటిని భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. అనంతరం భువనేశ్వరితో కలిసి కంపెనీ ప్రతిధులు, ఉద్యోగులు ఫొటోలు దిగారు.
Nara Bhuvaneswari
Srikalahasti
TCL Company
Telugudesam

More Telugu News