Ambati Rambabu: ఖమ్మంలో మంత్రి అంబటికి చేదు అనుభవం

AP minister Ambati Rambabu faces bitter experience in Khammam
  • బీఆర్ఎస్ నేత ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యేందుకు ఖమ్మం వచ్చిన అంబటి
  • టిఫిన్ చేసేందుకు ఓ హోటల్ కు వెళ్లిన వైనం
  • గోబ్యాక్ అంబటి అంటూ టీడీపీ శ్రేణుల నిరసన
ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు తెలంగాణలోని ఖమ్మంలో చేదు అనుభవం ఎదురయింది. ఒక బీఆర్ఎస్ నేత ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆయన ఖమ్మంకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నగరంలోని ఒక హోటల్ లో టిఫిన్ చేసేందుకు వెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు హోటల్ వద్దకు చేరుకున్నాయి. అంబటిని అడ్డుకునేందుకు యత్నించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ హోటల్ ముందు వారు ధర్నాకు దిగారు. అంబటి రాంబాబు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా వారు నినదించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న పోలీసులు హోటల్ వద్దకు చేరుకుని అంబటి రాంబాబును అక్కడి నుంచి సురక్షితంగా పంపించేశారు.
Ambati Rambabu
YSRCP
Khammam
Telugudesam

More Telugu News