Gorantla Madhav: చంద్రబాబుపై గోరంట్ల మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు

Chandrababu will die in 2024 says Gorantla Madhav
  • బస్సు యాత్ర చేసిన చంద్రబాబు జైలు యాత్ర చేస్తున్నారన్న మాధవ్
  • 2024లో జగన్ మళ్లీ సీఎం అవుతారని జోస్యం
  • లోకేశ్ పాదయాత్రను పక్కన పెట్టి పారిపోయారని ఎద్దేవా

హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2024లో చంద్రబాబు చస్తారని... జగన్ సీఎం అవుతారని చెప్పారు. చంద్రబాబు బస్సు యాత్ర చేసి ఇప్పుడు జైలు యాత్ర చేస్తున్నారని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేసి... ఇప్పుడు పారిపోయే యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

ఇక నారా లోకేశ్ యువగళం యాత్ర చేసి... ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరిగే యాత్ర చేస్తున్నారని అన్నారు. లోకేశ్ పాదయాత్రను పక్కన పెట్టి పారిపోయారని చెప్పారు. మరోవైపు చంద్రబాబును ఉద్దేశించి గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి. జైల్లో చంద్రబాబుకు ఏదైనా అపకారం తలపెట్టే అవకాశం ఉందని ఇప్పటికే టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News