బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు కాలం చెల్లింది.. వాటిని మార్చాల్సిందే: అమిత్ షా
- సీఆర్ పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ చట్టాల్లో మార్పులు చేయాలన్న కేంద్ర హోంమంత్రి
- త్వరలో నేర చట్టాల బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావం
- నేషనల్ పోలీస్ అకాడమీ పాసింగ్ ఔట్ పరేడ్ లో మాట్లాడిన అమిత్ షా
సీఆర్ పీసీ, ఐపీసీ, ఎవిడెన్స్ చట్టాలు బ్రిటిష్ పాలన కాలం నాటివని, ప్రస్తుత పరిస్థితులకు ఇవి సరిపోవని అమిత్ షా అన్నారు. శాసనాలకు రక్షణ కల్పించడమే వీటి ఉద్దేశమని అన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రజల హక్కులను కాపాడడమే లక్ష్యంగా కొత్త చట్టాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం వివిధ రకాల వ్యవస్థీకృత నేరాలు సమాజానికి సవాళ్లు విసురుతున్నాయని చెప్పారు. హవాలా, నకిలీ నోట్ల చలామణి, క్రిప్టో కరెన్సీ వంటి సవాళ్లపై పటిష్ఠంగా పోరాడాలని ట్రైనీ ఐపీఎస్ లకు ఆయన సూచించారు. అమరవీరుల బలిదానాన్ని ప్రేరణగా తీసుకుని కర్తవ్య నిర్వహణలో పట్టుదలగా ఉండాలని అమిత్ షా చెప్పారు.