YS Sharmila: తెలంగాణ ఎన్నికల్లో షర్మిల పార్టీకి గుర్తు కేటాయించిన ఎన్నికల సంఘం

  • వైఎస్సార్ తెలంగాణ పార్టీకి గురువారం ఉమ్మడి గుర్తు కేటాయిస్తూ ఆదేశాల జారీ
  • షర్మిల పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయించిన ఎన్నికల సంఘం
  • 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించిన షర్మిల
CEC allotted a common symbol to Sharmila party

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉమ్మడి గుర్తును కేటాయించింది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బైనాక్యులర్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీతో విలీనంపై ఢిల్లీకి వెళ్లి షర్మిల చర్చలు జరిపారు. అయితే ఆ తర్వాత విలీనం అంశం ముందుకు కదల్లేదు. దీంతో తాము అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని షర్మిల స్పష్టం చేశారు.

More Telugu News