Ambati Rambabu: మీరెంత ఉద్యమం చేస్తే చంద్రబాబు అంత ఇరుక్కుపోతారు: నారా భువనేశ్వరి యాత్రపై అంబటి వ్యాఖ్యలు

Ambati Rambabu satires on Nara Bhuvaneswari Nijam Gelavali bus tour
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • పలువురు టీడీపీ కార్యకర్తల మరణం
  • నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి పరామర్శ యాత్ర
  • అవినీతి గెలవాలి అని యాత్ర చేపడితే బాగుంటుందని అంబటి ఎద్దేవా
స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత మరణించిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. నిజం గెలవాలి పేరిట ఆమె నిన్నటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్నారు. దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. 

నిజం గెలవాలని నారా భువనేశ్వరి ఎంతగా ఉద్యమం చేస్తే చంద్రబాబుకు అంత నష్టం అని అన్నారు. చంద్రబాబు కోసం పోరాడే కొద్దీ, ఆయన మరింతగా ఇరుక్కుపోతారని వ్యాఖ్యానించారు. నారా భువనేశ్వరి నిజం గెలవాలి అని యాత్ర చేసే బదులు... అన్యాయం గెలవాలి, అవినీతి గెలవాలి, అబద్ధం గెలవాలి అని యాత్ర చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. 

నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు ఇప్పుడు జైల్లో ఉన్నారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయని, అలాంటప్పుడు అరెస్ట్ చేయడంలో ఆశ్చర్యమేముందని అన్నారు. 

చంద్రబాబు అరెస్టయితే కొందరు ప్రాణాలు వదిలారట... ఇప్పుడు వాళ్లను పరామర్శిస్తున్నారట అంటూ నారా భువనేశ్వరి బస్సు యాత్రపై అంబటి వ్యంగ్యం ప్రదర్శించారు.
Ambati Rambabu
Nara Bhuvaneswari
Bus Tour
Nijam Gelavali
Chandrababu
YSRCP
TDP

More Telugu News