Etela Rajender: గజ్వేల్ ఎన్నికలు కురుక్షేత్రం లాంటివి: ఈటల రాజేందర్

Etala Rajender compares Gajwel election with kurukshethra
  • బీజేపీ సభకు ప్రజలు రాకుండా డబ్బులిచ్చి, అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్న ఈటల
  • హుజూరాబాద్‌లో ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టినట్లు గజ్వేల్‌లోనూ అదే జరుగుతుందని వెల్లడి 
  • ఎన్ని కుట్రలు చేసినా బీజేపీయే గెలుస్తుందన్న బీజేపీ ఎమ్మెల్యే
హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో జరిగిందే ఇప్పుడు గజ్వేల్‌లోనూ జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. గురువారం వర్గల్ సరస్వతీదేవి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... గజ్వేల్‌లో ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధం లాంటివన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.

బీఆర్ఎస్ ఎన్ని కుయుక్తులు, కుట్రలు చేసినా గెలిచేది బీజేపీయే అన్నారు. గజ్వేల్‌లో ఏ పార్టీ అయినా సమావేశాలు పెట్టుకోవచ్చునని, కానీ బీజేపీ సమావేశాలకు ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డబ్బులిచ్చి బీజేపీ సభకు రాకుండా చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ ఇలాగే చేశారన్నారు. కానీ వారు ప్రలోభాలకు లొంగకుండా ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టారన్నారు. ఈసారి గజ్వేల్‌లో అదే జరుగుతోందన్నారు.
Etela Rajender
KCR
BJP
Telangana Assembly Election

More Telugu News