BRS: బీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి రాజీనామా

MLC Damodar Reddy resigns from BRS
  • ఈ నెల 31న ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటన
  • బీఆర్ఎస్‌లో తనకు అన్ని విధాలుగా సహకరించారని వెల్లడి
  • కానీ స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన

అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాగర్ కర్నూలు జిల్లా నాయకుడు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 31వ తేదీన కొల్లాపూర్‌లో జరగనున్న పాలమూరు ప్రజాభేరి బహిరంగ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరనున్నారు.

గురువారం ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్‌లో తనకు అన్ని విధాలుగా సహకరించారని, కానీ స్థానిక సమస్యలను మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపించారు.

  • Loading...

More Telugu News