Ram Gopal Varma: రాజమండ్రి సెంట్రల్ జైలు వెలుపల రామ్ గోపాల్ వర్మ సెల్ఫీ

Ram Gopal Varma selfie at Rajahmundry prison
  • మరోసారి ఆసక్తికర ట్వీట్ చేసిన వర్మ
  • రాజమండ్రి విచ్చేసిన వర్మ
  • నేను బయట... ఆయన లోపల అంటూ జైలు వద్ద సెల్ఫీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలు తీయడానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ కోవలోనే వ్యూహం, శపథం అనే చిత్రాలను రూపొందిస్తున్నారు. వర్మ తన సినిమాలతో ఎంత కలకలం సృష్టిస్తారో, తన వ్యాఖ్యలు, చర్యలతోనూ అందరి దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంటారు. 

తాజాగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు విచ్చేశారు. జైలు వెలుపల పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన చోట వర్మ సెల్ఫీ తీసుకున్నారు. దీనిపై ఆయన ఎక్స్ లో స్పందించారు. "రాజమండ్రి సెంట్రల్ జైలుతో ఓ సెల్ఫీ. నేను బయట... ఆయన లోపల" అంటూ తన ఫొటోపై కామెంట్ చేశారు.
Ram Gopal Varma
Rajahmundry
Jail
Selfie

More Telugu News