Himachal Pradesh: అర్ధరాత్రి హుటాహుటిన ఆసుపత్రిలో చేరిన హిమాచల్ ప్రదేశ్ సీఎం!

Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu Hospitalised
  • స్టమక్ ఇన్ ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్న ముఖ్యమంత్రి
  • సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో సుఖు అడ్మిషన్ 
  • ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్విందర్ సింగ్ సుఖు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం అర్ధరాత్రి ప్రాంతంలో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కడుపులో ఇన్ ఫెక్షన్ తో బాధపడుతున్న సీఎం సుఖును సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో చేర్పించారు. వైద్యుల బృందం ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. అల్ట్రాసౌండ్ రిపోర్ట్ నార్మల్ అని వైద్యులు తెలిపారు.

మిగతా పరీక్షల్లోనూ అంతా నార్మల్ గానే ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం సీఎం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. కాగా, ఇటీవల ధర్మశాలలో జరిగిన ఇండియా, న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్ ను సీఎం సుఖు కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, జేపీ నడ్డాలతో కలిసి స్టేడియంలో వీక్షించారు.
Himachal Pradesh
CM SuKhu
Sukhvinder singh
Congress
Simla
IGMC

More Telugu News