Srileela: తన తొలి లిప్ లాక్ ఎవరితోనే చెప్పేసిన శ్రీలీల!

What Srileela told about her first lip lock
  • వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీలీల
  • పెద్ద స్టార్ల సరసన నటిస్తున్న యువ నటి
  • అధర చుంబనాలకు దూరం అంటున్న శ్రీలీల

'భగవంత్ కేసరి' సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్న యువనటి శ్రీలీల పలు చిత్రాలతో బిజీగా ఉంది. వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన 'ఆదికేశవ' చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో శ్రీలీల డ్యాన్స్ తో అదరగొట్టేసిందని చెపుతున్నారు. పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, మహేశ్ బాబుతో గుంటూరు కారం సినిమాలతో పాటు నితిన్, విజయ్ దేవరకొండలతో కూడా కలిసి సినిమాలను చేస్తోంది. అయితే ఇంత వరకు శ్రీలీల హద్దులు దాటి నటించలేదు. తనకంటూ కొన్ని లిమిట్స్ పెట్టుకుని ముందుకు సాగుతోంది. ముఖ్యంగా అధర చుంబనాల వంటి సన్నివేశాలకు పూర్తిగా దూరంగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమెకు ఒక ప్రశ్న ఎదురయింది. ఒకవేళ టాలీవుడ్ లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారని ఆమెను ప్రశ్నించగా... ఏ హీరోతో కూడా అలాంటి సీన్ లో నటించనని చెప్పింది. తన మొదటి ముద్దు తన భర్తకేనని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News