Amit Shah: జనసేనతో కలిసి పని చేయండి: కిషన్ రెడ్డికి అమిత్ షా సూచన

Amith Shah suggests Kishan Reddy to work with Janasena in Telangana
  • నిన్న అమిత్ షాతో భేటీ అయిన పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి
  • తెలంగాణలో సీట్ల సర్దుబాటుపై అవగాహనకు రావాలన్న అమిత్ షా
  • సమావేశంలో చర్చకు రాని ఏపీలో పొత్తు వ్యవహారం

తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో కలిసి పని చేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు కొనసాగిన ఈ సమావేశంలో ఇరు పార్టీలు ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ఎన్నికల్లో పోటీపై ఇరు పార్టీల నేతలు కలిసి చర్చించుకుంటామని... ఎవరెవరు, ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని చర్చించుకుని చెపుతామని అమిత్ షాకు పవన్ కల్యాణ్, కిషన్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. రేపు హైదరాబాద్ పర్యటనకు అమిత్ షా వస్తున్నారు. ఈ లోగానే సీట్ల సర్దుబాటుపై ఒక అవగాహనకు రావాలని ఇరువురు నేతలకు అమిత్ షా తెలిపారు. దీనికి ఇరువురు నేతలు అంగీకరించారు. 


మరోవైపు తెలంగాణలో 33 స్థానాల్లో పోటీ చేసేందుకు జనసేన రెడీ అయినట్టు సమాచారం. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో సీట్లు తమకు కావాలని జనసేన అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అమిత్ షాతో చర్చల్లో ఏపీలో కలిసి పోటీ చేసే అంశం చర్చకు రాలేదని సమాచారం.

  • Loading...

More Telugu News