Aham Brahmasmi: మంచు మనోజ్ ‘అహం బ్రహ్మస్మి’ ఆగిపోలేదట.. దర్శకుడి తాజా అప్‌డేట్!

Aham Brahmasmi Will Be Starts Soon Says Director Srikanth N Reddy
  • పరస్పర అంగీకారంతోనే సినిమాకు గ్యాప్ ఇచ్చామన్న దర్శకుడు శ్రీకాంత్
  • ‘అహం బ్రహ్మస్మి’ తప్పకుండా ఉంటుందన్న దర్శకుడు
  • ‘లీలమ్మో’ పాట విడుదల సందర్భంగా వెల్లడి
టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ సినిమాలకు దూరమై చాలాకాలమే అయింది. చాలా గ్యాప్ తర్వాత ‘అహం బ్రహ్మస్మి’తో వస్తున్నట్టు ప్రకటించి అభిమానులను అలరించాడు. ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజైంది. ఇది చూసి బొమ్మ బాగుండేలా ఉందన్న టాక్ కూడా నడించింది. అయితే, ఆ తర్వాత మొదటి భార్య ప్రణతిరెడ్డితో విడాకులు.. భూమా మౌనికతో రెండో పెళ్లి వంటి వాటితో బిజీగా మారడంతో సినిమా షూటింగ్ కొంతకాలం వాయిదా పడింది. అంతా కుదురుకున్నాక అయినా సినిమా పట్టాలెక్కుతుందని భావిస్తే ఇప్పటి వరకు ఆ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ‘అహం బ్రహ్మస్మి’ అటకెక్కి ఉంటుందన్న వార్తలు కూడా వచ్చాయి. 

తాజాగా, ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీకాంత్ ఎన్.రెడ్డి అప్‌డేట్ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో మనోజ్ ఈ సినిమాకు కొంత గ్యాప్ ఇచ్చినట్టు చెప్పాడు. దీంతో, తాను మరో సినిమా చేస్తానని ఆయనకు చెప్పానని గుర్తు చేశాడు. పరస్పర అంగీకారంతోనే సినిమాను పక్కన పెట్టాం తప్పితే, ఆ ప్రాజెక్టు ఆగిపోలేదని, తప్పకుండా ఉంటుందని స్పష్టం చేశారు. వైష్ణవ్ తేజ్-శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించి ‘ఆదికేశవ’ సినిమా వచ్చే నెల 10 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆ సినిమాలోని ‘లీలమ్మో’ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాంత్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
Aham Brahmasmi
Manchu Manoj
Srikanth N Reddy
Adikeshava

More Telugu News