Hardik Pandya: టీమిండియా అభిమానులకు షాక్.. పాండ్యా కోలుకోవడానికి మరింత సమయం

Breaking Hardik Pandya to miss two more games due to injury
  • బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా కాలికి గాయం
  • బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స
  • గ్రూప్ దశలో చివరి మ్యాచ్ లకు అందుబాటులోకి

ఇంగ్లండ్ తో మ్యాచ్ కు సైతం ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా దూరం కానున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ సందర్భంగా కాలి చీలమండకు గాయం కావడంతో న్యూజిలాండ్ తో మ్యాచ్ కు పాండ్యా దూరం కావడం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతున్నాడు. వచ్చే ఆదివారం ( ఈ నెల 29న) భారత్-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ముందు వచ్చిన సమాచారం మేరకు అయితే పాండ్యా ఇంగ్లండ్ తో మ్యాచ్ కు అందుబాటులోకి రావాలి. కానీ, గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పట్టేట్టు ఉందన్నది తాజా సమాచారం.


వచ్చే నెల 2న ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలకంతో జరిగే సమరం, లేదంటే 5వ తేదీన కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ కు పాండ్యా అందుబాటులోకి రావచ్చన్నది తాజా సమాచారం. పాండ్యా విషయంలో తొందరపడకూడదని, అతడు పూర్తిగా కోలుకునే వరకు సమయం ఇవ్వడమే మంచిదని బీసీసీఐ సైతం భావిస్తోంది. ప్రపంచకప్ గ్రూప్ దశలో చివరి మ్యాచ్ లకు అందుబాటులోకి వస్తాడన్న అంచనాలతో ఉంది. పాండ్యా లేకపోయినా, న్యూజిలాండ్ పై భారత్ జట్టు రాణించి విజయం సాధించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News