Team India: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా ఫుల్ చిల్.. ట్రెక్కింగ్‌తో ఖుష్.. వీడియో చూడండి!

Rahul Dravid along with Team India Support Staff Unwind In Dharamshala
  • 29న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు రెడీ అవుతున్న భారత్
  • కివీస్‌తో మ్యాచ్ తర్వాత బోల్డంత సమయం
  • ధర్మశాల కొండల్లో విహరిస్తూ ప్రకృతిలో మైమరచిన టీమిండియా సభ్యులు
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా ఫుల్ చిల్.. ట్రెక్కింగ్‌తో ఖుష్
ధర్మశాలలో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన రోహిత్‌శర్మ సారథ్యంలోని భారత జట్టు 29న లక్నోలో ఇంగ్లండ్‌తో జరగనున్నమ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. కివీస్‌తో మ్యాచ్ తర్వాత కావాల్సినంత సమయం లభించడంతో ట్రెక్కింగ్‌తో చిల్ అవుతోంది. సపోర్ట్‌స్టాఫ్‌తో కలిసి ధర్మశాల కొండల్లో విహరిస్తూ ప్రకృతి అందాల ఆస్వాదనలో మునిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ఎక్స్ ఖాతాలో పంచుకుంది.

రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి వారు మాత్రం దీనికి దూరమయ్యారు. చాలాకాలం తర్వాత వారు ఇంటికి వెళ్లడంతో ఈ ట్రెక్కింగ్ అనుభూతిని మిస్సయ్యారు. ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ను ఓడించిన భారత జట్టు ఓ అరుదైన ఘనత సాధించింది. ధర్మశాల హెచ్‌పీసీఏ స్టేడియంలో జరిగిన ఐసీసీ మ్యాచ్‌లో కివీస్‌ 20 ఏళ్ల తర్వాత టీమిండియా చేతిలో ఓటమి పాలైంది.
Team India
Dharmashala
Treking
World Cup 2023

More Telugu News