Washing Machine: విశాఖలో నోట్లకట్టల కలకలం.. వాషింగ్ మెషిన్ లో బయటపడ్డ రూ.1.30 కోట్లు

Currency Bundles Found In Washing Machine Near Vizag Nad Junction
  • ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
  • 30 మొబైల్ ఫోన్లు కూడా తరలిస్తున్న ఆటో డ్రైవర్
  • డబ్బు, ఫోన్లు ఎవరివని ఆరా తీస్తున్న అధికారులు
విశాఖపట్నం నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళుతున్న ఓ ఆటోను ఆపి తనిఖీ చేసిన  పోలీసులకు అందులో నోట్ల కట్టలు కనిపించడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వాషింగ్ మెషిన్లను డెలివరీకి ఇచ్చేందుకు వెళుతున్నట్లు ఆటో డ్రైవర్ చెప్పాడు. అయితే, మెషిన్ లో మాత్రం గుట్టల కొద్దీ నోట్లకట్టలు బయటపడ్డాయి. వాటి విలువ రూ.1.30 కోట్లు అని పోలీసులు వెల్లడించారు. అందులోనే 30 మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు. విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఈ ఆటో పట్టుబడింది.

వాషింగ్ మెషిన్లను విజయవాడకు తరలిస్తున్నట్లు ఆటో డ్రైవర్ వెల్లడించాడు. అయితే, నోట్ల కట్టలు ఎవరివనే విషయం కానీ, నగదుకు సంబంధించిన ఇతరత్రా ఆధారాలు కానీ చూపించలేదు. దీంతో నగదుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆటోను సీజ్ చేసి డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మిగతా వివరాలను పోలీసులు వెల్లడించలేదు. నగరంలోని ఓ ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ నుంచి ఈ నోట్ల కట్టలను తరలిస్తున్నట్లు సమాచారం.
Washing Machine
currency bundles
Vizag
Trolly Auto
NAD Junction
Police checking
currency bundles in auto
Delivery Auto

More Telugu News