దమ్ముంటే కేసీఆర్ కొడంగల్‌లో పోటీ చేయాలి... రాజకీయాల్లో ఎవరుండాలో డిసైడ్ అవుతుంది: రేవంత్ రెడ్డి
- కొడంగల్ ఎన్నికల ప్రచారంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
- కొడంగల్‌లో నామినేషన్ వేస్తా... కేసీఆర్ వస్తే తేల్చుకుంటామన్న రేవంత్
- ఇచ్చిన హామీలను కేసీఆర్ ఏ మేరకు నెరవేర్చారో చెప్పాలని డిమాండ్
కొడంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ విధానాలతో ప్రజల్లో అసహనం పెరుగుతోందన్నారు. అందుకే ఈసారి అధికార మార్పిడికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు. కల్వకుంట్ల కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. భవిష్యత్తు అంతా కాంగ్రెస్ దే అన్నారు. బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.