Roja: నారా భువనేశ్వరి ఏం కోరుకుంటున్నారో మేం కూడా అదే కోరుకుంటున్నాం: మంత్రి రోజా

Roja opines on Nara Bhuvaneswari offered prayers in Tirumala
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
  • చంద్రబాబు జైల్లోనే ఉండాలని ప్రార్థించినట్టున్నారు అంటూ రోజా వ్యంగ్యం
  • నిజం గెలిస్తే చంద్రబాబు ఎప్పటికీ జైల్లోనే ఉంటారని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అర్ధాంగి నారా భువనేశ్వరి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. చంద్రబాబు ఎప్పటికీ జైల్లోనే ఉండాలని భువనేశ్వరి వెంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్టున్నారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. నిజం గెలవాలని భువనేశ్వరి ఆ భగవంతుడిని గట్టిగా పూజించినట్టున్నారు... మేం కూడా అదే కోరుకుంటున్నాం... నిజం గెలవాలి... నిజం గెలిస్తే చంద్రబాబు ఎప్పటికీ జైల్లోనే ఉంటారు అంటూ రోజా వ్యాఖ్యానించారు. నిజం గెలవాలని భువనేశ్వరి చిత్తశుద్ధితో గనుక ఆలోచిస్తే ఆమె సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు.
Roja
Nara Bhuvaneswari
Tirumala
Chandrababu
YSRCP
TDP

More Telugu News