Bhagavanth Kesari: అదే బాలకృష్ణగారి గొప్పతనం: అనిల్ రావిపూడి

Anil Ravipudi Interview
  • భారీ విజయాన్ని సాధించిన 'భగవంత్ కేసరి'
  • ఫ్యామిలీ డ్రామా వర్కౌట్ అయిందన్న అనిల్ రావిపూడి
  • నటించే అవకాశం దొరికిందన్న శ్రీలీల
  • డాన్సులతో పాటు ఫైట్లు చేయడం మరిచిపోలేనని వెల్లడి

బాలకృష్ణ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఈ నెల 19వ తేదీన వచ్చిన 'భగవంత్ కేసరి' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ దసరా పండుగకి థియేటర్లకు వచ్చిన సినిమాలలో ముందువరుసలో నిలిచింది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడిని .. శ్రీలీలను దిల్ రాజు ఇంటర్వ్యూ చేశారు.

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "బాలకృష్ణగారు ఇంతకుముందు చేసిన ఫ్యామిలీ డ్రామాతో కూడిన సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఆ ఫార్మేట్ ఆయనపై మళ్లీ వర్కౌట్ అవుతుందని అనిపించింది. అందువలన ఈ కథను రెడీ చేసుకుని వెళ్లి ఆయనకి వినిపించాను. కథ వినగానే ఓకే చేయడమే కాదు .. కూతురుగా శ్రీలీలను తీసుకోవడానికి ఒప్పుకోవడం ఆయన గొప్పతనం" అని అన్నాడు. 

శ్రీలీల మాట్లాడుతూ .. "నాకు భరతనాట్యంలో ప్రవేశం ఉంది. అందువలన డాన్సుల పరంగా పేరు వచ్చింది. ఈ కథ వినగానే నటించడానికి స్కోప్ ఉన్న పాత్ర అనిపించింది. అందువలన వెంటనే ఓకే చెప్పేశాను. ఇక బాలకృష్ణ గారితో కలిసి డాన్సులు మాత్రమే కాదు .. ఫైట్లు కూడా చేయడం మరిచిపోలేని అనుభవం" అంటూ చెప్పుకొచ్చింది. 

  • Loading...

More Telugu News