Telangana: తెలంగాణలో శీతల గాలులు.. పెరుగుతున్న చలి

  • తిరుగుముఖం పట్టిన నైరుతి రుతుపవనాలు
  • రాష్ట్రంలోకి వీస్తున్న శీతల గాలులు
  • పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
Temperatures drop in Telangana

తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చలి పులి మెల్లగా పంజా విసురుతోంది. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రం వైపు శీతల గాలులు వీస్తున్నాయి. చల్లటి గాలుల కారణంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తోంది. మెదక్, హనుమకొండ, రామగుండం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్, ఖమ్మం, భద్రాచలం తదితర ప్రాంతాల్లో సాధారణం కంటే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఖమ్మంలో 35.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది.

More Telugu News