Rajahmundry Central Jail: నేడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ లకు సెలవు.. కారణం ఇదే!

Today is holiday for Mulakhats in Rajahmundry central Jail due to Vijaya Dasami
  • విజయదశమి సందర్భంగా ములాఖత్ లకు సెలవు
  • ఖైదీలు, వారి కుటుంబ సభ్యులు సహకరించాలన్న జైలు అధికారులు
  • ఇదే జైల్లో ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఈరోజు ములాఖత్ లు బంద్ అయ్యాయి. నేడు విజయదశమి సందర్భంగా ములాఖత్ లకు ఈరోజు జైలు అధికారులు సెలవు ప్రకటించారు. దీనికి సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని జైల్లోని ఖైదీలు గ్రహించాలని, ఖైదీల కుటుంబ సభ్యులు సహకరించాలని అధికారులు కోరారు. 

మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ములాఖత్ లు సెలవు కావడంతో... ఈరోజు ఆయనను ఎవరూ కలిసే అవకాశం ఉండదు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో గత నెల 9వ తేదీన ఆయనను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన ఇదే జైల్లో ఉంటున్నారు. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు, చంద్రబాబు హెల్త్ బులెటిన్ ను జైలు అధికారులు విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం బాగుందని బులెటిన్ లో వైద్యులు పేర్కొన్నారు. చంద్రబాబు యాక్టివ్ గా ఉన్నారని తెలిపారు.
Rajahmundry Central Jail
Mulakath
Chandrababu

More Telugu News